హైదరాబాద్: బౌలింగ్‌కే అనుకూలించే పిచ్‌లు తయారు చేసి టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని టీమిండియా మాజీ బౌలర్ హర్బజన్ సింగ్ మండిపడ్డారు. ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్లు ఔట్ కాలేదన్నారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో బ్యాట్స్‌మెన్లు ఔటయ్యారని చెప్పుకొచ్చారు. సమర్ధుడైన బౌలర్, సమర్థుడైన బ్యాట్స్‌మెన్‌కు గల తేడా ఏంటని అడిగారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మూడో రోజుకే 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారని, కానీ దీని గురించి ఎవరు మాట్లాడరని దుయ్యబట్టారు. ఎక్కువ వికెట్లు తీసిన జట్టు గెలిచిందని, వికెట్లు తీసిన బౌలర్ గొప్ప క్రికెటర్‌గా మారారని చురకలంటించారు. భారత బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్ చేసిన తీరు తనకు నచ్చలేదని, క్రీజు వదిలి బయటకు వచ్చి బ్యాటింగ్ చేయలేదని విమర్శించారు. స్పీన్ పిచ్‌పై బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు.
ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టులో సపారీలు విజయం సాధించారు. మూడో రోజు మ్యాచ్ ముగియడంతో టెస్టు క్రికెట్ నాశనం చేస్తున్నారని మాజీలు, క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేయడం మంచిద కాదని క్రికెట్ పండితులు సలహా ఇస్తున్నారు. ప్రత్యర్థులకు వేస్తున్న స్పిన్ ఉచ్చులో పడి భారత జట్టు ఓటమి పాలు అవుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.