మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి గా ప్రశ్నించింది. “ఎంఎల్‌ఎల అనర్హతపై ఈపాటి కి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఇది తీవ్రమైన కోర్టు ధిక్కరణ. నూతన సంవత్సర వేడుకలను ఎక్కడ నిర్వహించుకోవాలో ఇక ఆయనే నిర్ణయించుకోవాలి” అని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో రెండు వేర్వేరు పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజెఐ గవాయ్ స్పష్టం చేశారు. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎంఎల్‌ఏల అనర్హతపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.