హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మన కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని, మతం మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని.. తెలియజేశారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూనే.. హిందూ ధర్మం కోసం పనిచేయాలని, హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యం అని.. ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.