కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 124 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత భారత్‌లో సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా స్థానం మెరుగుపడింది. ఇప్పటివరకూ డబ్ల్యూటిసిలో మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీలు రెండింట గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు. దీంతో 66.67 విజయశాతంతో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది సౌతాఫ్రికా.
ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటిసిలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత్, 4 మ్యాచుల్లో గెలిచి, 3 మ్యాచుల్లో ఓడి, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 54.17 విజయశాతంతో నాలుగో ప్లేస్‌లో స్థిరపడింది భారత్. ఇక 100 విజయశాతంతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. శ్రీలంక 66.67 శాతంతో శ్రీలంక మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00), ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67) వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక వెస్టిండీస్ ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడి.. ఎనిమిదో ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ ఈ డబ్ల్యూటిసిలో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.