రాజ్‌కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్-ఎ 27.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. భారత బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 68 పరుగులతో కదం తొక్కాడు. అభిషేక్ శర్మ 32, తిలక్ వర్మ 29 పరుగులతో రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయానికి తొడ్పడిన రుతురాజ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.