అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం వైసిపి కార్యాలయంపై దాడి జరిగింది. వైసిపి కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టిడిపి కార్యకర్తలు, ఎంఎల్ఎ బాలకృష్ణ అభిమానులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసిపి ఇన్ చార్జి దీపిక భర్త వేణురెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వైసిపి కార్యకర్తలపై కూడా దాడి చేశారు. నటుడు, టిడిపిఎంఎల్ఎ బాలకృష్ణపై హిందూపురం వైసిపి ఇంచార్జ్ దీపికా రెడ్డి భర్త వేణురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతోనే టిడిపి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నామని వేణు రెడ్డి విమర్శించారు. వారికి ఓట్లు వేస్తాం కానీ వారు హైదారబాద్‌లోనే ఉండిపోతున్నారని, మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వేణురెడ్డి వ్యాఖ్యలపై టిడిపి కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వైసిపి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వేణు రెడ్డి భార్య దీపికారెడ్డి గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.