హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఎస్ జిటి గా విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ వాట్సప్‌లో మెసేజు పెట్టినందుకు శ్రీనివాస్‌ను డిఎఇ సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదనేది సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని భీముడు అనే నెటిజన్ కామెంట్ చేశాడు.