అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్‌ఒ సతీష్ కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బృందాలు దర్యాప్తు వేగం పెంచాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పక్కన సతీష్ మృతిదేహం కనిపించిన విషయం తెలిసిందే. గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఫస్ట్ ఎసి బోగీలోని నెంబర్ 29లో కూర్చున్నాడు. సతీష్ 29 నుంచి 11 నెంబర్‌లో ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ రైలులో చంపేసి కిందకు తోసారా? లేక కదులుతున్న రైలు నుంచి కిందకు తోసారా? లేక పరకామణి కేసులో వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. గుత్తి జిఆర్‌పి పోలీసులు సతీష్‌ను హత్య చేశారని దర్యాప్తు వెల్లడించారు. సిఐడి విభాగం డిజి రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకొని పోలీసులు బృందాలకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు, వైద్య నిపుణులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోమలి గ్రామం శివారులో రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. కదులుతున్న రైళ్లో నుంచి బొమ్మలను కిందకు తోసేసి ఏ భాగంలో గాయాలు అవుతున్నాయో విషయాలను పరిశీలిస్తున్నారు. గుత్తి నుంచి రెండు, మూడు రైళ్లలో పోలీసులు బొమ్మలను కిందకు తోసేసి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. మృతదేహానికి సీటీ స్కానింగ్ నిర్వహించిన రెడియోలాజిస్టులు, శవ పరీక్ష చేసిన ఫోరెన్సిక్ వైద్యులతో రవిశంకర్ సమావేశమవడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
2003లో ఏప్రిల్‌లో టిటిడి ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఎవిఎస్‌ఒ హోదాలో రవికుమార్‌పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టిటిడికి ఇవ్వగా మరికొన్ని ఆస్తులు సతీష్ పేరుపై రాయించుకొని కేసు మాఫీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీస్ విభాగంలో పని చేశాడు. డిప్యుటేషన్‌పై టిటిడిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. 2022లో ఎవిఎస్‌హోగా పదోన్నతి లభించడంతో టి టిడి ఆలయంలో సతీష్ విధులు నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.