కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 10 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ నాలుగు బంతులాడి పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ ఒక పరుగు చేసి జాన్సెన్ బౌలింగ్‌లో వెర్రీన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(05), ధ్రువ్ జురెల్(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు, ఇంకా 114 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఈ ఇన్నింగ్స్ లో మార్కో జాన్సన్ రెండు వికెట్లు తీశాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 189
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 153