భావ్‌నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సోనీ ఇంట్లో కలుసుకున్నారు. చీర గురించి కొన్ని ఖర్చుల గురించి ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీనితో ప్రేమికుడు సాజన్ బరాయియా రాక్షసుడై అత్యంత పాశవికంగా చంపివేశాడు. పరారైన ఈ వ్యక్తి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సోనీ ఈ విధంగా పెళ్లి రోజు నాడు , పెళ్లికి ముందే అంతం కావడంపై ఆవేదన వ్యక్తం అయింది.