హైదరాబాద్: కార్ఖానా పిఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ జరిగింది. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. కార్ఖానాలోని గన్ రాక్ ఎంక్లేవ్ కెప్టెన్ గిరి (76) అనే వ్యక్తి ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన వ్యక్తి, మరొక నలుగురితో కలిసి చోరీ చేశారు. ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి.. కట్టేసి నేపాలీ ముఠా చోరీకి పాల్పడ్డారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 25 తులాల బంగారంతో పాటు రూ. 23 నగదు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారని కార్ఖానా పోలీసులు తెలిపారు.