కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు సౌతాఫ్రికా 48 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్పిన్ మాయజాలంలో ఇరుక్కొని సపారీలు విలవిలలాడిపోయారు. రవీంద్ర జడేజా స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు చాపచుట్టేశారు. కెప్టెన్ తెంబా బవుమా ఒక్కడే పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం సఫారీ జట్టు 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, బుమ్రా, అక్షరపటేల్ చెరో ఒక వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 189