నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ డబుల్ రోల్ చేసి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ‘అఖండ-2’. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ మరింత హైప్ పెంచుతూ వచ్చాయి. సినిమా టైటిల్ టీజర్, ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘తాండవం’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ని చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా ‘3డి’లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చి సినిమాల్లో ఇదొకటి కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసిం. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఎం తేజస్వినీ నందమూరి సమర్ఫణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ చచాంట, గోపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.