మన తెలంగాణ/ మెదక్ జిల్లా ప్రతినిధి: సంపాదన కోసం అక్రమదందాలు చేసి లిక్కర్ స్కాంలో ఇరికి జైలు పాలై పార్టీని భ్రష్టుపట్టించి జనంబాట పేరుతో అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్ అన్నారు. జిల్లాలో చేపట్టిన జనంబాట కార్యక్రమం ద్వారా కవిత అస్యతపు ప్రచారాలు చేస్తూ తమ నాయకుడైన హరీష్‌రావును దూషిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయి మరోసారి అవకాశం ఇస్తే అవినీతి వల్ల నగల దుకాణంలో బ్లాక్ మెయిల్ చేసి ప్రజాధరణ కొల్పోయి ఓడిపోయావన్నారు. అయినప్పటికి పార్టీ ఎమ్మెల్సీ పదవీని ఇస్తే కన్న తండ్రితోపాటు తల్లిలాంటి పార్టీని దూషిస్తున్నావని ద్వజమెత్తారు.
పార్టీలో ఎన్నో పదవులు పొంది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విదంగా కవిత వైఖరి ఉందని అన్నారు. జిల్లాలోని ఎన్నో అభివృద్ది పనులు చేపట్టిన తమ నాయకుడు హరీష్‌రావుతోపాటు మాజీ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటామని హెచ్చరించారు. సీఎం రేవంత్ మెప్పు కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నవని అన్నాడు. ప్రభుత్వ అసమర్థతపై పోరాడకుండా కన్నతండ్రైన కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీష్‌రావులపై దుమ్మెత్తి పోయడం సరికాదన్నారు. కాళేశ్వరం ద్వారా హల్దివాగు నిండటంతో జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు. రెడ్డిపల్లిలోని 400 ఎకరాలలో హరీష్‌రావు ఫౌంహౌస్ ఉంటే వెంటనే చూపించాలని అట్టి భూమిని ప్రజలకు పంపిణీ చేస్తామని సవాల్ విసిరారు. అసత్య ప్రచారాలు చేస్తూ ట్రిపుల్ ఆర్ బాధితులను తప్పుదోవ పట్టిస్తే ఊరుకోమన్నారు.
బీఆర్ ఎస్ హయంలోనే మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఎంతో అభివృద్దికి నోచుకుందన్నారు. కేసీఆర్ కూతురువని ఊరుకుంటున్నామని లేదా జిల్లాలో అడుగు పెట్టేదానివికాదని హెచ్చరించారు. మరోమారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే బీఆర్ ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ అంజనేయులు, జీవన్ రావు, ఆర్‌కె శ్రీనివాస్, అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కిశోర్, జయరాజ్, మాయ మల్లేశం, ప్రభురెడ్డి, జుబేర్, శ్రీను నాయక్, రంజిత్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.