చెన్నై: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్‌తో బీహార్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా వరకూ అవకతవకల మధ్యనే ఎన్నికలు జరిగాయి. దీనితోనే బీహార్‌లో ఇప్పటి ఫలితం వెలువడిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె సెల్వపెరుతంగయై చెప్పారు. ఆయన చెన్నైలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడేమి జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని తెలిపారు. బీహార్‌లో ప్రతి ఇంటికి ఎన్‌డిఎ తరఫున ముట్టిన రూ.10000 తోనే ఓట్లు పెరిగాయని విమర్శించారు.
తమ మిత్రపక్షం ఆర్జేడీ ఓట్ల శాతం కూడా కేవలం 0.3 శాతమే పడిపోయింది. అయితే సీట్లు తగ్గి ఉంటాయని చెప్పారు. సర్‌తో పలు ప్రయోజనాలను పొందిన బిజెపికి పెరిగింది ఒకే ఒక్క ఓట్ల శాతం అని విశ్లేషించారు. అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటామని, తరువాత పార్టీ తరఫున సమగ్ర ప్రకటన వెలువడుతుందని తెలిపారు.