మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి సమస్యలు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న వారికి వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఇటువంటి సందర్భాలలో కుటుంబ పెద్దల సలహాలు సూచనలు తీసుకుని పాటించండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
వృషభ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ధనం అధికంగా ఖర్చు అవుతుంది. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని స్థాయిని సంపాదించుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ఉద్యోగపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కలిసి రావు. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు.
మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా వరకు అభివృద్ధి సాధిస్తారు. కలిసి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కి షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా సుబ్రమణ్య స్వామి అష్టకాన్ని చదవండి. ఈ కార్దిక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. భూవివాదాలు తీరిపోతాయి. బ్యాంకు లోన్లు పర్సనల్ లోన్లు మంజూరు అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు ఆశించిన మార్పులు జరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం మారడానికి అనుకూలమైన కాలం కాదు. సినీ కళా రంగంలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. వైద్యుత్ లో ఉన్నవారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.
సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కొన్ని కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ పరంగా చిన్నచిన్న మనస్పర్ధలు కలహాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో నూతన సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. చేపట్టిన పనులను అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. నూతన పెట్టబడులు పెడతారు. నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ఉద్యోగం చేసే వారి కంటే కూడా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే.
తులారాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు గ్రే.
వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టు వర్క్ లు లభిస్తాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెడతారు. నర దిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటను ధరించండి. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.
ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కోర్టు సంబంధమైన విషయాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. స్థిరాస్తులను పెంచుకుంటారు. స్వగృహ యోగం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు క్రీం కలర్.
మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గోశాలలో గోవులకు గో గ్రాసం దానం చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆర్థికపరమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.
కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ లభిస్తుంది. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ ఇప్పుడు పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాబిస్తాయి. గడిచినా రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షలలో పాల్గొంటారు. మీ లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరులకు మీకు తోచిన సహాయం చేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో మరొకసారి ఆలోచన చేయడం మంచిది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.