న్యూఢిల్లీ : బీహార్‌లో మోడీ సంక్షేమ మంత్రం అద్భుతమే సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ యన అలుపెరుగని రీతిలోనే క్షేత్ర స్థాయిలోకి దిగా డు. ఎన్‌డిఎకు అపూర్వ విజయం సాధించడంలో కీల క పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు. కేంద్రంలో, బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఉండటం, డబుల్ ఇంజిన్ ఫలితం ఓట్ల పంటను పం డించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మిశ్రిత సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి బీహారీ మహిళలకు నేరుగా ఆర్థిక సాయం అందడం, వారి ఖాతాలలోకి డబ్బులు రావడం వంటివి ఓట్లను ప్రభావితం చేశాయి. ఇక ప్ర ధాని మోడీ ఎన్నికల సభల్లో ప్రతి చోటా దాదాపుగా లాలూ హయాంలో జంగిల్‌రాజ్ నెలకొందని సభికులకు చెపుతూ వచ్చారు. జంగిల్‌రాజ్ కావాలా? వికసి త బీహారా తేల్చుకోవల్సి ఉందని ప్రజలకు పిలుపు ని చ్చారు. ప్రధాని మోడీ సారధ్యంలోనే బిజెపి జెడియు ల ఎన్‌డిఎ తరఫున ప్రచారపర్వం సాగింది. దీని ఫలి తం ఎన్‌డిఎకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. పైగా జెడియుతో పోలిస్తే ఈసారి బిజెపి ఈ రాష్ట్రంలో ఎక్కు వ స్థానాలు పొందిన పార్టీగా నిలిచింది. ఇప్పుడు గె లుపు ప్రతిష్ట అంతా కూడా మోడీ ఖాతాలోకి చేరింది. మోడీ రాష్ట్రంలో 13 బహిరంగ సభలలో ప్రసంగించారు. తుది దశలో పాట్నాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. బీహారీల ఆత్మగౌరవం, వారి కష్టపడి పనిచేసే మనసత్వాన్ని కొనియాడారు. దీనితో ఆయన హిందీ ఘాటు ప్రసంగాలు హిందీబెల్ట్ ర్రాష్ట్రంలో బీహారీల మనసులను నేరుగా తాకాయి.
ఎన్‌డిఎలో లుకలుకలకు అడ్డుకట్ట
అభ్యర్థుల ఎంపిక , సీట్ల సర్దుబాట్లు, తరువాతి ప్రచారసరళి వంటి పలు ప్రక్రియల దశల్లో మోడీ భాగస్వామ్యపక్షాలతో పూర్తి స్థాయి సఖ్యత నెలకొనేలా చేశా రు. అభ్యర్థుల ఖరారు తరువాత తలెత్తిన అసంతృప్తి నివారణకు మోడీనే అమిత్ షాతో పోలిస్తే ఎక్కువగా కీలక పాత్రపోషించారు. ఇక బీహారీ కుటుంబ పెద్దల కు తరచూ ఆయన చేసిన విజ్ఞప్తి క్రమంలో ఎక్కువగా కుటుంబ పెద్దలకు ఇచ్చిన పిలుపు పనిచేసింది. జంగిల్‌రాజ్ దశ భయానక పీడకలలు ప్రతి ఇంటి యువతరం పై పడకుండా చూసుకోవల్సిన బాధ్యత పెద్దలదే అని చెప్పడం పనిచేసింది.
మోడీ సెంటిమెంట్.. రాహుల్ ఛత్ చీత్కారాలు
బీహార్ ఎన్నికల ప్రచార దశలోనే దీపావళి పండుగ దశలో బీహారీల సార్వత్రిక ఛత్ పూజా ఉత్సవాల ఘ ట్టం వచ్చింది. ఈ సాంప్రదాయాన్ని మోడీ కొనియాడారు. బీహారీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే దశ లో ఛత్ క్రతువు ఓ నాటకం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మోడీ ప్రజలలోకి బాగా తీసుకువెళ్లగలిగారు. ఛాతీమయ్యాను కించపర్చడం తగు నా? అయినా రాముడంటే ఆదరణలేని వారికి , మన దేవతలకు పూజలు చేయని వారికి ఇటువంటి పద్ధతుల పట్ల ఆదరణ ఉంటుందా? అని ప్రశ్నించారు.