హైదరాబాద్: శంషాబాద్‌లో పివి నరసింహా రావు ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృస్టించింది. ఫ్లైఓవర్‌పై కారు బోల్తాపడింది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్న మహిళలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర టాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.