పాట్నా: బీహార్‌లో మార్పు తథ్యమని, కాబోయే ముఖ్యమంత్రి తేజశ్వీయాదవ్ అని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢంకా భజాయించిన మహాఘట్బంధన్ చతికిపడింది. 2020 బీహార్ అసెంబ్లిలో అతిపెద్ద ఏకైక పా ర్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ 2025 ఎన్నికలలో కేవలం 32 స్థానాలకే పరిమితమయింది. బీహార్ లో ఆర్జేడీ కి ఎదురైన రెండో అత్యంత దారుణమైన ఓటమి ఇది. 20 ఏళ్లుగా పార్టీ ఉద్ధాన పతనాలను బేరీజు వేసుకుం టే..2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ వి జయం తర్వాత నితీశ్ కుమార్ తొలిసారి బీహార్ ము ఖ్యమంత్రిగా అధికారం చేపట్టిననాడు ఆర్జేడీ 55 సీట్ల ను గెలుచుకుంది. అప్పటివరకూ తేజశ్వీ యాదవ్ తల్లి రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్జేడీకి బీహార్ లో ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాలలో ఓటమి తప్పలేదు. నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టి అద్భుతమైన విజయాన్ని సాధించి బీహా ర్‌లో ఆర్జేడీ పాలనకు చరమగీతం పాడారు.
2010లో జరిగిన తర్వాతి ఎన్నికల్లో ఆర్జేడీ చాలా తీవ్రంగా దెబ్బతింది. కేవలం 22 సీట్లకే పరిమితమైంది. ఆర్జేడీకి ఎ దురైన అత్యంత దారుణమైన ఫలితం ఇది. ఇరవై ఏళ్ల తర్వాత నితీశ్ కుమార్ అనేక పరాజయాల తర్వాత బీజేపీ, జేడీయు 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో ఏ కంగా 205 స్థానాలను గెలుచుకుని మరో అపూర్వ వి జయాన్ని సాధించాయి. 36 ఏళ్ల తేజశ్వీయాదవ్ తన తండ్రి,ప్రముఖ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన పార్టీ నాయకత్వం వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ఆర్జేడీని స్థాపించి, పలు ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2025లో బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలలో ఆర్జేడీ ఇప్పటికీ అత్యధిక ఓట్ల వాటా కలిగి ఉండడం. ఆ పార్టీ కొన్ని సీ ట్లను భారీ తేడాతో గెలుచుకున్నప్పటికీ, మహాఘట్బంధన్ పార్టీలన్నింటినీ సమైక్యంగా గెలిపించుకోలేకపోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏది ఏమైనా ఆర్జేడీకి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కలిసి రాలేదు. ఎన్డీఏ తో పోలిస్తే.. ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్బంధన్ చాలా..చాలా వెనుకబడి ఉంది.