మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. నవీన్ యాదవ్‌కు 98,988(51%) ఓట్లు వచ్చాయి. మాగంటి సునీతకు 74,259 (38%) ఓట్లు రాగా బీజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061(9%) ఓట్లు పోలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీ రావడం, అది కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం సంచలనంగా మారింది. దీంతో బీఆర్‌ఎస్ సిట్టిం గ్ సీటును కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉ.8గం.లకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యత కొనసాగించింది. ఇక బీ జెపి అభ్యర్థి డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయారు. పోటీ లో ఉన్న 58మంది అభ్యర్థులలో 55 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్లకన్నా తక్కువగా రావడం విశేషం. ఈ ఎన్నికలో విజయం సాధించిన నవీన్‌యాదవ్‌కు రిటర్నింగ్ అధికారి సాయిరాం దృవీకరణ పత్రం అందేజేశారు.
ఫలించిన సిఎం రేవంత్‌రెడ్డి వ్యూహం
రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలనకు రెఫరెండంగా ఈ ఉప ఎన్నిక అంటూ ప్రచా రం జోరుగా సాగిన నేపథ్యంలో ఇక్కడ గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం కొత్త ఎ త్తు లు ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ముందుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టా రు. అనంతరం నియోజకవర్గానికి ఇన్‌చార్జీని నియమించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మునిసిపల్ డివిజన్‌ల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. స్టార్ కాంపేయిన్‌లను ప్రకటించారు. 4సార్లు సిఎం స్వ యంగా రోడ్ షోలు నిర్వహించారు. మునుపెన్నడు లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను తమకు మద్దతునిచ్చేలా దళిత, బీసీ, ఓసీ, సెటిలర్స్, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులకు డివిజన్‌ల వారీగా ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు. పిజెఆర్ పేరును ప్రస్తావించడం, అజహార్‌కు మంత్రి పదవిని కేటాయించడం వంటివి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పట్టం కట్టేలా చేశాయనేది టాక్. అభ్యర్థి బీసి కావడం, స్థానికుడై ఉండటం, గతంలోనూ రెండు మార్లు పోటీచేసిన అనుభవం, రాజకీయాలు తెలియడం ఆయన ఈ విజయానికి ప్లస్‌పాయింట్స్‌గా మారినట్టు రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం.
కెసిఆర్ దూరం
అధికార పక్షానికి ప్రధాన పోటీదాడు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పక్షాన ప్రచారానికి గులాబీ దళం అధినేత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దూరంగా ఉన్నారు. కనీసం పా ర్టీకి ఓటెయ్యండి, సునీతను గెలిపించండి అం టూ ఒక ప్రకటనను కూడా చేయలేదు. పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విస్తృత ప్రచా రం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ప్రచారం చేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు, అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు సంధించినా.. రోడ్ షోలు నిర్వహించి నా.. సీటును నిలుపుకోలేకపోయారు. స్థానికం గా పార్టీ బలంగా ఉన్నా.. కార్పోరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడటాన్ని ఆపలేకపోవడం, బలమైన నా యకులు లోకల్‌గా లేకపోవడం లోపంగా కనిపించిందనీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పదేపదే ప్రస్తావించినా ఓటర్లను తమవైపునకు తిప్పుకోలేకపోయారేది రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి షాక్
ఈ ఉపఎన్నికల ఫలితంలో డిపాజిట్ లేకుండా స్థానిక ఓటర్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి షాక్ ఇచ్చారు. బీజెపికి కేవలం 17,061ఓట్లు మాత్రమే వేసి పార్టీ వర్గాలను, నగర వాసులను ఆశ్చర్యానికి గురిచేశారు. కేంద్ర మంత్రులు కిషనర్ రెడ్డి, బండిసంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులు, ఎంపీ డికె ఆరుణలు ప్రచారం చేసి నా కనీసం గత ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోలేక చివరికి డిపాజిట్‌ను కోల్పోవడం గమనార్హం.