హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి కారు అదుపుతప్పి బోల్తాపడింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టి బోల్తాపడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సీట్లులో కూర్చున్న యువతి స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే స్థానికులు స్పందించి కారు అద్ధం పగులగొట్టి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువతి కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.