శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నౌగామ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. సీజ్ చేసిన పేలుడు పదార్థాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించిన పేలుడు పదార్థాలను శనివారం రాత్రి 11 గంటలకు ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో శరీర భాగాలు మూడు వందల మీటర్ల దూరంలో పడిపోయాయి. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న వాహనాలు కాలిబూడిదగా మారాయి. పేలుడు పదార్థాలు 360 కిలోలు ఉన్నట్టు సమాచారం.