మన తెలంగాణ/హైదరాబాద్:తాము బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని, ‘కారు’ ది గలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావ్, సంజయ్‌లు ‘క్రాస్ ఎగ్జామినేషన్’ సందర్భంగా తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఏల అ నర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం ఇద్దరు ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లపై దాఖలైన పిటిషన్లపై వాదన లు విన్నారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తెల్లం వెంకట్రావ్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెపి వివేకానంద పిటిషన్ దాఖ లు చేశారు. ఎంఎల్‌ఏ సంజయ్‌పై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ వాదన లు విన్నారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావు ను, సంజయ్‌ను క్రాస్ ఎగ్జామ్ చేశారు.
ఇదిలాఉండగా శుక్రవారం ఎంఎల్‌ఏలు అరికెపూ డి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిల అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ ప్రసాద్ కు మార్ విచారణ ఎదుట విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఏలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ గత నెలలో ముగిసింది. ఫిరాయింపు ఎంఎల్‌ఏలు మొత్తం పది మందికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించగా, ఎంఎల్‌ఏలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేయలేదు.ఇదిలాఉండగా ఎంఎల్‌ఏల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఇదివరకే స్పీకర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఆ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. అయితే తాను స్పీకర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సకాలంలో విచారణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదు కాబట్టి మరో రెండు నెలల గడువు ఇవ్వాలని కోరుతూ స్పీకర్ ప్రసాద్ కుమార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.