హైదరాబాద్: డబ్బు పంపాలన్న మెసేజ్ లు ఎవరూ నమ్మవద్దు అని సిపి కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అనుమానస్పద లింకులు మెసేజ్ లు, వీడియో కాల్స్ బ్లాక్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని సజ్జనార్ తెలియజేశారు. ఆపదలో ఉన్నానని.. డబ్బు పంపాలని మెసేజ్ లు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఒక స్నేహితుడు రూ. 20 వేలు పంపి మోసపోయారని అన్నారు. సైబర్ మోసాలపై 1930 లేదా https://cybercrime.gov.in/ లో ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనార్ సూచించారు.