దోహ: ఆసియా రైజింగ్ స్టార్స్ 2025లో యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఎ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఎ జట్టుకు వైభవ్ వీరోచిత బ్యాటింగ్‌తో 297 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆరంభం నుంచి వైభవ్ దూకుడుగా ఆడాడు. ఆయాన్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదిన వైభవ్.. ఆ తర్వాత జవదుల్లా బౌలింగ్‌లో్ మూడు ఫోర్లు ఓ సిక్సు రాబట్టాడు.
రోహిద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి.. 16 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. అనంతరం ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. పరాజుద్దీన్ తర్వాతి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు బాది 98 పరుగులకు చేరుకున్నాడు. ముహమ్మద్ అర్ఫాన్ వేసిన పదో ఓవర్‌లో ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. శతకం చేసిన తర్వాత కూడా వైభవ్ తన దూకుడుకు బ్రేక్ వేయలేదు. హర్షిత్ కౌశిక్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు సిక్సులు కొట్టి 144 పరుగుల వద్ద పరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వైభవ్‌తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ(83) పరుగులతో రాణించడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది యుఎఇ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.