కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సపారీలు 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన స్పెల్‌తో సఫారీలను బోల్తా కొట్టించాడు. బుమ్రా బౌలింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు బెంబేలెత్తారు. రికెల్టన్ 23 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ఎడెన్ మక్రమ్ 31 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెంబా బవుమా మూడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వైన్ మల్డర్(16), టోనీ ది జోర్జి(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.