పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్‌డిఎ 174 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్‌బంధన్ 65 స్థానాల్లో ఆధిక్యం, జెఎస్ పి 3, ఇతరులు 1 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. లఖినారాయ్ లో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా (బిజెపి), మహువాలో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్( జెజెడి)లు వెనుకంజ లో ఉన్నారు. తారాపూర్ లో డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరీ ( బిజెపి) ముందంజ లో ఉన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జెడియు (71), బిజెపి (72), ఆర్ జెడి (43), ఎల్ జెపిఆర్ వి (15), ఐఎన్ సి 9, సిపిఐఎమ్ఎల్ఎల్ (4), జెఎస్ పి 4, ఇతరులు (7) స్థానాలలో ముందంజలో ఉన్నారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.