జార్ఖండ్‌కు చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. బాలాజీ నగర్‌లోని మా భూమి న్యాచురల్స్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బినాయి కుమార్(27) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు, ఈ నెల 13వ తేదీన షాపులోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డైరీలో కుటుంబ సభ్యులకు సారీ, గుడ్‌బై, ఫర్‌గివ్ అని రాసుకున్నాడు. డిప్రెషన్‌లో ఉండేవాడని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.