చెందిన పర్యావరణవేత్త, వృక్షమాతగా పేరొందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు.114 పంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ 1911లో జన్మించిన తిమ్మక్క వృక్షోరక్షతి రక్షిత తపనతో కర్నాటకలోని హులికల్ కుదూర్ మధ్య నాలుగున్నర కిలోమీటర్ల వరకూ వేలాది మొక్కలను నాటడమే కాకుండా, వాటి రక్షణకు పాటుపడినందుకు ఆమెకు పలు పురస్కారాలు దక్కాయి, నిరాడంబర జీవితం , పిల్లలు లేని తనకు చెట్లే సంతానం అనే ఆలోచనతో జీవితాన్ని అంకితం చేసిన మహిళగా పేరొందారు.
హంపీ వర్శిటీ , జాతీయ పౌర పురస్కారం, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు వంటి అనేక విశిష్ట గౌరవాలను ఆమె తన సేవకు గుర్తింపుగా ఆశించకుండానే పొందారు. వీటి గురించి పట్టించుకోకుండా చెట్ల మధ్యనే గడిపారు. ఆమె మృతి పట్ల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి , ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ , యడ్యూరప్ప ఇతర కన్నడ నేతలు నివాళులు అర్పించారు. ప్రకృతి పర్యావరణం పట్ల ఆమె ప్రేమ ఆమె పవిత్ర ప్రకృతిలో సముచిత స్థానం పదిలం అవుతుందని సిఎం సిద్ధరామయ్య స్పందించారు.