ఆటోలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 331 గ్రాముల గంజాయి, ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుంప శ్రీనివాస్, కావేటి విజయ్‌కుమార్ కలిసి బాలాపూర్, మిథాని రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లింది. ఆటోలో ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
ధూల్‌పేట్‌లో…
ధూల్‌పేట, ఝాన్సీ చౌరాయి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.152కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ సింగ్, విజయలక్ష్మి, బిజిమా ది బాయి కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. నరేందర్ సింగ్‌ను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.