హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ గెలుపు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం అని.. అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియా సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బిఆర్ఎస్ కు సెలవు చెప్పారని, రాష్ట్రంలో బిఆర్ఎస్ కు చోటు లేదని మరోసారి రుజువైందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆంక్షాలకు అనుగుణంగా ప్రజాపాలన జరుగుతుందని, నవీన్ యాదవ్ ను గెలిపించిన ఘనత.. సిఎం, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అని..కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు సాధించడం ఖయామని, కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం అని మహేష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం జిహెచ్ఎంసి ఎన్నికలకు నాంది అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.