కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కి దిగింది. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టు 105 పరుగులు చేసింది. ఆ తర్వాత కొంత సమయానికే కుల్దీప్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి ముల్డర్ (24) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 33వ ఓవర్ 3వ బంతికి క్రీజ్‌లో స్థిరపడుతున్న డి జోర్జి (24) కూడా ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాప్రికా 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టబ్స్ (5), వెర్రెయిన్ (5) ఉన్నారు.