హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ అతి వేగంగా నడపడంతో బోల్తా పడింది. ఈ ఘటన బీజాపూర్-హైద్రాబాద్ నేషనల్ హైవే రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.