మన తెలంగాణ/రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డైమండ్ సిటీలో ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికుల భయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ షాపు గోదాంలో పూర్తిగా ఫర్నిచర్ కాలిబూడిదగా మారింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.