హైదరాబాద్: ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్‌పై విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద వసూళ్లతో దూసుకపోతుండడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్‌తో ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. సక్సెస్ మీట్‌లో రష్మిక చేతిని విజయ్ ముద్దు పెట్టడంతో అభిమానులు ఈలలు వేశారు. రష్మిక నవ్వుతూ సందడి చేసింది. రష్మిక, విజయ్‌కు నిశ్చితార్థం జరిగినట్టు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్న విషయం విధితమే.
ఈ సందర్భంగా విజయ్ కూడా మాట్లాడారు. ఈ సినమా రష్మి భూమాదేవి పాత్రలో అద్భుతంగా నటించిందన్నారు. అందరూ సంతోషంగా ఉండాలనే తపించే వ్యక్తిత్వం రష్మికదని, కథల ఎంపికలో కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశంసించారు. కథ వినగానే తాను తొలుత చేయాలనుకున్నానని, భూమా జీవితంలో జరిగినట్టుగా తన జీవితంలో కూడా జరిగాయని విజయ్ తెలియజేశారు. ఇప్పుడు అర్థమవుతోందిని అందరి జీవితంలో ఇలాగే జరిగియన్నారు. అందరం తప్పులు చేస్తామని, ఎవరూ పరిపూర్ణం కాదు అని, మగాళ్లు వాళ్ల భాగస్వామికి ఎప్పుడూ రక్షణగా ఉండాలనుకుంటారని, కానీ రక్షణ అనేది వాళపైనా మాత్రమే ఉండాలని, నియంత్రణలా ఉండకూడదని చెప్పారు. సతీమణిల సంతోషాన్ని, కలల్ని రక్షిస్తున్నట్టుగా ఉండాలని సూచించారు.