విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. సూర్యారావు పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటన స్థానికులను సైతం భయాందోళనలకు గురి చేసింది. తెలిసిన వివరాల ప్రకారం హత్యకు గురైన మహిళ విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్‌తో గత కొంతకా లంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కోపంతో భార్య ఉన్న చోటుకు వెళ్లి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సరస్వతీ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడని,
స్థానికులు భయంతో దగ్గరికి రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా’ అంటూ విజయ్ కేకలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యా రావుపేట పోలీసులు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కొన సాగుతున్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ సమ స్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా ప్రాణాలు తీయడం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇటు వంటి చర్యలతో సదరు వ్యక్తులు కూడా జైలు పాలై నిండు జీవితాన్ని కోల్పోతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.