కోల్ కతా : సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. 2021లో బీజేపీ టికెట్ పై ఎన్నికై, తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హోకోర్టు గురువారం అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై స్పీకర్ తన తీర్పులో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అని పేర్కొన్నందున కోర్టు ఆ నిర్ణయాన్ని వికృతమైనదిగా పేర్కొంది. 2021 జూన్ 11 నుంచి అసెంబ్లీలో ఆయన సభ్యత్వం అనర్హతకు గురైనందున, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా రాయ్ నామినేషన్ ను కూడా ఇది పక్కన పెట్టింది.
ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ 2022 జూన్ 8న ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టడానికి తమకు ఎలాంటి సందేహం లేదని జస్టిస్ దేబాంగ్సు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని అధికారి దాఖలు చేసిన పిటిషన్ తో సమానంగా విచారణకు వచ్చిన బిజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కోర్టు అనుమతించింది.
2021 జూన్ 11నుంచి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ , 1986 నిబంధనల ప్రకారం ముకుల్ రాయ్ అనర్హుడిగా ప్రకటించినట్లు జస్టిస్ ఎండీ షబ్బర్ రషీది తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2021 జూన్ 11న ముకుల్ రాయ్ బిజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ నిరూపించగలిగారని ధర్మాసనం పేర్కొంది.