మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శనివారం(నవంబర్ 15) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ నెల 29 వ రకు టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క ల్పించారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్ ప రీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సం చాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. సర్వీసులో ఉ న్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్‌సిటిఇ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇవ్వగా, తాజాగా ఆ ఉత్తర్వులను విద్యాశాఖ సవరించింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు.
2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసు కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నది. కాగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని పేర్కొంది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి, టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఏటా రెండు సార్లు టెట్
టెట్ పేపర్ -1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఏడాదిలోనే రెండో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలి. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్‌సిటిఇ పొడగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు. ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. గత జూన్‌లో జరిగిన టెట్ పరీక్షకు 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 63,261 మంది, పేపర్ -2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15 వేల మంది వరకు ఉన్నారు.