మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఢిల్లీలో బాంబుదాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు విస్కృతంగా తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని షాంపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు బాంబ్ స్కాడ్స్, డాగ్ స్కాడ్‌లు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పటి నుంచి మూడు రోజుల నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడ అనుమానస్పదంగా కన్పించినా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
షాపింగ్ మాల్స్‌లో కూడా తనిఖీలు చేస్తున్నారు, ఎక్కువ మంది షాపింగ్‌కు రావడంతో తనిఖీలు చేస్తున్నారు. మాల్స్‌లో మెటల్ డిటెక్టర్ పెట్టి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీని అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బస్టాండ్లలో ఎక్కువగా రద్దీగా ఉండడంతో వాటిని కూడా అనువణువు తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్లలో ఎలాంటి మెటల్ డిటెక్టర్లు లేకపోవడంతో పోలీసులను అక్కడ భద్రత కోసం ఉంచారు. కొందరు పోలీసులు బస్టాండ్ల పరిసరాల్లో మోహరించారు. అలాగే రాత్రి సమయంలో హైదరాబాద్‌లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీకుని విచారిస్తున్నారు. ఉగ్ర కుట్రలో నగరానికి చెందిన వైద్యుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.