కోల్‌కతా: సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు నుంచి భారత యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించారు. అతన్ని తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా నుంచి సెలెక్టర్లు రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో జరిగే వన్డే సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ విషయాన్ని బుధవారం బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం నితీశ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. అయితే సెలెక్టర్ అనూహ్యంగా అతన్ని తొలి టెస్టు నుంచి రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో రాజ్‌కోట్‌లో జరిగే వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.