మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీ వ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలికి ప్రజలు వ ణికిపోతున్నారు. ఈ పరిస్థితి ఏజెన్సీ గ్రామాల్లో అ ధికంగా ఉంది. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠంగా 7.1డిగ్రీలు, తిర్యాణిలో 8.2 డిగ్రీలు నమోదయిం ది. దీంతో పాటు రాష్ట్రంలో గురువారం ఉదయం వరకురాజన్నసిరిసిల్లలో9.1,ఆదిలాబాద్‌లో 9.5, నిర్మల్‌లో 10.1, జగిత్యాలలో 10.4, సంగారెడ్డి లో10.7,కామారెడ్డిలో10.8,కరీంనగర్‌లో 11.2, సిద్దిపేట, నిజామాబాద్‌లో 11.3, మంచిర్యాలలో 11.4,మెదక్,రంగారెడ్డి, పెద్దపల్లిలో 11.5, యా ద్రాద్రి భువనగిరిలో 11.9, జయశంకర్ భూపాలపల్లిలో 12.1, వికారాబాద్‌లో 12.2, మహబూబ్‌నగర్‌లో 12.7, హన్మకొండలో 12.9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 13, జనగాం, వరంగల్‌లో 13.4, హైదరాబాద్, ములుగులో13.6,నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో 13.8,నల్గొండ14,సూర్యాపేట 14.5, మహబూబాబాద్‌లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్ర త నమోదయింది.
కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భ యపడుతున్నారు. ఉదయం 9 గంటలయినా చలి తీవ్రత తగ్గకపోవడంతో స్కూళ్లు, కార్యాలయాలు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇ బ్బంది పడుతున్నారు. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వా తావర శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో అతితక్కువగా హెచ్‌సీయూలో 11.8 డిగ్రీలు రికార్డయింది. రామచంద్రాపురం, పఠాన్ చెరువులో 12.5, రాజేంద్రనగర్‌లో 12.9, చందానగర్‌లో13.3, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల రికార్డయింది. ఉదయం 6 గంటల సమయంలో నగర శివార్లలోని ఇబ్రహీంపట్నలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలి హైరానా….ప్రతి వంద మందిలో ఒక్కరికి న్యూమోనియా
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెరుగుతున్న న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. దగ్గు సిరప్ తాగినా, ఎన్ని మందులు వేసుకున్న తగ్గని పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు చాలామంది న్యుమోనియా తో బాధపడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రెట్టింపు అవుతాయని, రెండేళ్లలోపు పిల్లలు, తక్కువ బరువుతో పుట్టిన వారు, పోషకాహార లోపం ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. చలి దెబ్బకు వృద్ధులకు న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తులు బిగుసుకుపోయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. చలి నుండి రక్షణ కల్పించడం, వెచ్చని దుస్తులు, మాస్కులు ధరించడం ద్వారా కొంతమేర ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వృద్ధులు కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే కారణంతో న్యుమోనియా బాధితులుగా మారుతున్నారు.
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా న్యుమోనియా బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ సీజన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, సకాలంలో చికిత్స చేయకపోతే దారుణ పరిస్థితిని ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. న్యుమోనియా వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇలా మూడు రకాలుగా ఊపిరితిత్తులపైన దాడి చేస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి ప్రధాన లక్షణాలతో ఇది వస్తుందని, వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకుంటేనే దీని నుండి బయట పడే అవకాశం ఉంది. శీతాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే, చలి నుండి కాపాడుకోకపోతే పరిస్థితి తీవ్రతరం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తతే శరణ్యం
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని దవాఖానాలను సందర్శించాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.