అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు కలకలం రేపింది. కుర్మాని పల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న కిష్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ రాగి పంటలను ఏనుగులు బీభత్సంగా నాశనం చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. చేనుకు కాపాలాగా వెళ్తే ఏనుగులు రైతులను బలి తీసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల భారీ నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అటవీ ప్రాంతాలలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా జూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పంట చేను నాశనం కావడంతో తమ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతకాలిసి వస్తుందన్నారు.