గృహ నిర్మాణానికి సంబందించిన పర్మిషన్ విషయంలో ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు టౌనిప్లానింగ్ అధికారులు ఏసిబి వలలో చిక్కారు. ఏసిబి డిఎస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలు.. బిల్డింగ్ పర్మిషన్ కోసం ఆదిభట్ల మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి వర ప్రసాద్, అసిస్టెంట్ వంశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు. నాలుగు వందల గజాల స్థలంలో నాలుగంతస్తుల భవన నిర్మాణం అనుమతి కోసం ఆ వ్యక్తి వద్ద లక్షన్నర డిమాండ్ చేసారు. ఎట్టకేలకు 80 వేల రూపాయలకు ఆంగీకారం తెలిపారు. ఈ మేరకు గురువారం బాదితుడి వద్ద నుండి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసిబి డిఎస్పీ తెలిపారు. కాగా ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.