హైదరాబాద్: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్‌పై విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద వసూళ్లతో దూసుకపోతుండడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. గతంలో మగవాళ్లకు కూడా జీవితంలో ఒకసారి పీరియడ్స్ వస్తే ఆడవాళ్లు పడే బాధ తెలుస్తుందని రష్మిక అన్నారు. ఈ కామెంట్స్ వైరల్‌గా మారడంతో రష్మిక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఒక ఉద్దేశంతో మాట్లాడితే దానిని మరోలా అర్థం చేసుకున్నారని రష్మిక మందనా తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడరని, షోలు ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే తనకు భయం వేస్తుందన్నారు. పీరియడ్స్ సమయంలో తాను భయంకరమైన నొప్పిని అనుభవిస్తానని, తాను ప్రతి నెల నొప్పిని భరించాల్సిందేనని, ఒకసారి స్పృహతప్పి పడిపోయానని, వైద్యుల దగ్గరికి వెళ్లి అన్ని చెకప్‌లు చేయించుకున్నానని రష్మిక పేర్కొన్నారు. ఇది సాధారణ విషయమని చెప్పారని, దేవుడా ఎందుకు తనని ఇంత బాధ పెడుతున్నావని ప్రతి నెల అనుకుంటున్నానని, ప్రతి ఒక్కరూ అనుభవిస్తేనే ఈ బాధ తెలుస్తుందని, పురుషులకు కనీసం ఒక్కసారైనా పీరియడ్స్ రావాలని కోరుకుంటున్నానని రష్మిక బాధను వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు మొత్తం షేర్ చేయకుండా సగం మాత్రమే కట్ చేసి షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. తన వ్యాఖ్యలను కట్ చేసి షేర్ చేయడం ఏంటని ఆమె అసహనం వ్యక్తం చేసింది.