సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేసేందుకు #GlobTrotter అనే పేరుతో పెద్ద ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న రామోజీ ఫిలీంసిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొననున్నారు.
కాగా, ఈవెంట్ ను ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మూవీపై హైప్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా క్రియేట్ అయ్యింది. మరోవైపు, మేకర్స్ అభిమానులకు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తోపాటు ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పసుపు కలర్ శారీలో గన్ కాలుస్తున్న ప్రియాంక పోస్టర్ ను వదిలారు.ఇందులో ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.