దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు కూడా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్క్వాడ్ తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్ ల వంటి రద్దీ ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.