మన తెలంగాణ/హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్‌గా తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తోంది. తెంబ బవుమా సారథ్యంలో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి న దక్షిణాఫ్రికా ఏకంగా 9 మ్యాచుల్లో జయకేతనం ఎగు ర వేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసింది. ఇక బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సుదీర్ఘ కాలంగా అందరి ద్రాక్షగా ఉన్న ఐసిసి ట్రోఫీని సొంతం చేసుకుంది. వరుస విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో దూసుకుపోతున్న సఫారీలతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆతిథ్య భారత జట్టుకు పరీక్షగా మారింది. కొంత కాలం క్రితం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూ డు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌పై సొంత గడ్డపై కళ్లు చెదిరే రికార్డు ఉన్న భారత జట్టు ఇలా ఘోర పరాజయం చవిచూస్తుందని ఎవరూ కూడా ఊహించలేక పో యారు.
టీమిండియా మాత్రం అందరి అంచనాలను తా రుమారు చేస్తూ కివీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్‌తో పోల్చితే సౌతాఫ్రికా చాలా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాం టి పరిస్థితుల్లో సఫారీలను ఓడించి సిరీస్‌ను సొంతం చే సుకోవడం భారత్‌కు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికాతో పోరు భారత్‌కు సవాల్‌గా తయారైంది. పటిష్టమైన సఫారీలను ఓడించ డం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. ఒం టిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌ లర్లు సౌతాఫ్రికా టీమ్‌లో ఉన్నారు. కెప్టెన్ బవుమా, మా ర్‌క్రమ్, జోర్జీ, జుబేర్ హంజా, డెవాల్డ్ బ్రేవిస్, వియాన్ ముల్డర్, మార్కొ జాన్సన్, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కైల్ వెర్రెన్నె వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు.
అంతేగాక రబడా, జాన్సన్, కేశవ్ మహరాజ్, హార్మర్, ముత్తుసామి, కార్బన్ బోస్చ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఇక ఆతిథ్య భారత్‌కు సిరీస్ కీలకంగా మారింది. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం షాక్ నుంచి టీమిండియా ఇంకా తేరుకోలేక పోతోంది. ఇందులో నుంచి బయట పడాలంటే బలమైన సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఘన విజయం సాధించాల్సిందే. అప్పుడే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఓడితే మాత్రం జట్టు మరింత ఒత్తిడిలోకి కూరుకు పోవడం ఖాయం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గౌహతిలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్, సౌతాఫ్రికా బోర్డులు ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించాయి.