అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం అక్కిరెడ్డిపాలెంలోని షీలానగర్ చౌరస్తా వద్ద కంటైనర్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్‌ఎడి వైపు వెళ్తున్న కంటైనర్ లారీ బోల్తాపడింది. మార్నింగ్ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నాలుగు క్రేన్ల సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.