ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషల్ కనకాల. హీరోగా తొలి చిత్రం ‘బబుల్‌గమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకుడు. చాలాకాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ డిసెంబర్ 12న సినిమాను విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రేమ కోసం ఓ యువకుడు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్‌లో వైవా హర్ష, రోషన్‌ల మధ్య సంభాషణలు అలరిస్తున్నాయి. హీరోయిన్ సాక్షి మడోల్కర్ నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. విలన్ పాత్ర కూడా మెప్పించే విధంగా ఉంది. మొత్తనికి టీజర్ ప్రేక్షకులకు నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి థియేటర్‌లో ‘మోగ్లీ’ ఎలా అలరిస్తుందో చూడాలి.