ఫరీదాబాద్‌లో వెలుగుచూసిన అంతర్రాష్ట టెర్రర్ మాడ్యూల్‌లో అదుపులోకి తీసుకున్న మొత్తం ఎనిమిది మందిలో నలుగురు వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆమెను డాక్టర్ షహీన్ సయీద్‌గా గుర్తించారు. ప్రస్తుతం షహీన్ పోలీసులు అదుపులో ఉంది. పేలుళ్ల కేసులో ఆమె కూడా అనుమానితురాలిగా ఉంది. మహారాష్ట్రకు చెందిన జఫర్ హయత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. స్వల్ప కాలంలోనే అంటే 2015లో అతనితో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని జఫర్ వెల్లడించారు. విడిపోయిన తర్వాత షహీన్ ఫరీదాబాద్‌లో ఒంటరిగా ఉంటున్నట్లు, అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే మరిన్ని వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆమె వివాహం, విడాకుల విషయాన్ని లక్నోలోని షహీన్ తండ్రి కూడా ధ్రువీకరించారు.